నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొల్లాపూర్ అభివృద్దిపై బహిరంగ చర్చ విషయమై ఇరువురు నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడంతో పోలీసులు వారిద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు.
నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొల్లాపూర్ లో జరిగిన అభివృద్దిపై బహరింగ చర్చపై మాజీ మంత్రి Jupally krishna rao, స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ విషయమై Kollapur లో Ambedkar చౌరస్తాలో చర్చకు సిద్దమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. అయితే ఈ విషయమై తాను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికే వెళ్లి చర్చకు సిద్దంగా ఉన్నానని హర్షవర్ధన్ రెడ్డి ప్రకటించారు. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే Beeram Harshavardhan Reddyలను పోలీసులు House Arrestచేశారు.
undefined
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎవరి హయంలో అభివృద్ది జరిగిందో చర్చకు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్దమా అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు. ఈ విషయమై ఈ నెల 26న అంబేద్కర్ చౌరస్తాలో చర్చ నిర్వహిస్తానని జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.ఈ సవాల్ కు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఈ నెల 21న స్పందించారు. అంబేద్కర్ చౌరస్తాలో కాదు ఈ విషయమై జూపల్లి కృష్ణారావు ఇంటికే వచ్చి చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఈ బహిరంగ చర్చలో పాల్గొనేందుకు ఇద్దరు నేతలు సిద్దమయ్యారు.ఇదే సమయంలో ఇద్దరు నేతలకు చెందిన అనుచరులు కూడా వారి ఇళ్ల వద్ద భారీగా చేరుకున్నారు. ఇరువురు నేతల ఇళ్ల వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్దకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లకుండా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మరో వైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లకుండా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుపై Congress అభ్యర్ధిగా పోటీచేసిన హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్ రెడ్డి TRS లోచేరడాన్ని వ్యతిరేకించారు. ఇరు వర్గాలు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి వర్గీయులు రెబెల్స్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలను కూడా పార్టీ నాయకత్వం చేసింది. కానీ ఇరు వర్గాలు తమ పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ నెల 18న కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. ఈ భేటీకి స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు కేటీఆర్ వెంట ఉన్నారు. జూపల్లి కృష్ణారావుతో కేటీఆర్ భేటీ అయిన తర్వాత కూడా ఈ ఇద్దరి నేతల మధ్య ఈ రకమైన సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.