సికింద్రాబాద్ నుంచి కోదండ రామ్ పోటీ ?

By rajesh yFirst Published Sep 18, 2018, 3:51 PM IST
Highlights

సికింద్రాబాద్ నియోజకవర్గంపై తెలంగాణ జనసమితి అధినేత ప్రొ.కోదండరామ్ కన్నేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 

హైదరాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గంపై తెలంగాణ జనసమితి అధినేత ప్రొ.కోదండరామ్ కన్నేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

టీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ నాలుగు పార్టీల మధ్య పొత్తు దాదాపుగా ఖరారు కావడంతో మహాకూటమి అభ్యర్థిగా కోదండరామ్ ను సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

మరోవైపు మహాకూటమి అభ్యర్థిగా తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చ జరుగుతుంది. గెలుపు ఓటములపై జోరుగా చర్చజరుగుతుంది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నసికింద్రాబాద్ నియోజకవర్గం కోదండరామ్ ను ఆదరించవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం సికింద్రాబాద్ నియోకవర్గం పరిధిలోనే ఉండటం, ఆ యూనివర్శిటీలోనే ప్రొఫెసర్ గా కోదండరామ్ విధులు నిర్వహించడం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అలాగే మాణికేశ్వర్ నగర్, అడ్డగుట్ట ఏరియాల ప్రజలతో కోదండరామ్ కు మంచి పరిచయాలు ఉన్నాయని అలాగే కోదండరామ్ నివాసం తార్నాక కాడంతో మరింత కలిసొచ్చే అంశంగా అభిప్రాయపడుతున్నారు. ఇన్ని అవకాశాలు కోదండరామ్ గెలుపుకి దోహదపడే అంశాలుగా పరిగణించవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 

ఇకపోతే కాంగ్రెస్, టీడీపీల తరపున సరైన అభ్యర్థి లేకపోవడంతో కోదండరామ్ నే మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఇప్పటికే చర్చ జరుగుతోందని తెలుస్తోంది. మంత్రి పద్మారావుకు గట్టి పోటీ ఇవ్వాలంటే అది కోదండరామ్ లాంటి వ్యక్తుల వల్లే సాధ్యమన్న ప్రచారం కూడా లేకపోలేదు. 

click me!