టీఆర్ఎస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్...

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 3:40 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీలో తాను చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ ఖండించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను బిజెపిని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
 
రజాకార్ల పార్టీ టీఆర్ఎస్ లో తాను చేరతానని ప్రచారం జరగడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు సంవత్సరాల క్రితం కేటీఆర్ తో కలిసిన పోటోలతో దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. అక్రమ కేసులతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్న పార్టీలో చేరాల్సిన అవసరం తనకు లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. చట్టపరంగానే ఆ కేసులను ఎదుర్కొంటానని...ఎవరికి భయపడేది లేదని అన్నారు.

గోరక్షణ కోసం మాత్రమే తాను బిజెపి పార్టీకి రాజీనామా చేసినట్లు రాజాసింగ్ వెల్లడించారు. తన వల్ల పార్టీ ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బిజెపి పార్టీ ప్రతి విషయంలోనూ తనకు అండగా ఉందని అలాంటి పార్టీని వీడబోనని రాజాసింగ్ స్పష్టం చేశారు. 

click me!