కోదండరాం రాజీనామాకు ఆమోదముద్ర

First Published May 13, 2018, 2:30 PM IST
Highlights

జెఎసి నిర్ణయం

తెలంగాణ జెఎసి విసృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కోదండరాం గతంలో చేసిన రాజీనామాను జెఎసి ఆమోదించింది. అంతేకాదు ఆయనతోపాటు రాజనామా చేసి తెలంగాణ జన సమితిలో చేరిన వారి రాజీనామాలను ఆమోదించింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా మాజీ జెఎసి ఛైర్మన్ హోదాలో కోదండరాం మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ?

నేను జెఎసి చైర్మన్ పదవి కి రాజీనామా చేశాను. ఇప్పుడు ఆమోదం తెలిపారు. తెలంగాణ రావడంలో జెఎసి పాత్ర మరువలేనిది. జెఎసి కారణంగానే మేము ప్రపంచానికి పరిచయం అయ్యాము. 2009 నుండి ఇప్పటి వరకు నాకు సహకరించినందుకు మీకు కృతజ్ఞతలు. జెఎసి ని పోలిన సంస్థలు దేశంలో ఎక్కడా లేవు. ప్రజా ఉద్యమాలు, నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా పోరాటం చేశాము. పాలనలో మార్పు కోసము మేము జన సమితి పార్టీ పెట్టవల్సిన అవసరం ఏర్పడినది. జెఎసిని వీడుతున్నoదుకు బాధ గా ఉంది. జెఎసి చేసే పని కి మా వంతు కృషి మేము చేస్తాం. బలమైన ప్రజాస్వామిక నిర్మాణానికి జెఎసి కృషి  చేస్తోంది. రాజకీయాలలో మార్పు కోసమే జెఎసి నుండి వైదొలుగుతున్నాను.

తెలంగాణ జెఎసి ఛైర్మన్ పదవికి ఇటీవల కోదండరాం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గన్ పార్కు వద్ద గల అమరుల స్థూపం వద్ద జెఎసి కన్వీనర్ రఘుకు అందజేశారు. తెల్లారే తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ జరిపారు. ఆ సభలో కోదండరాం ఆ పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. అయితే గన్ పార్కు వద్ద ఆయన చేసినా రాజీనామాకు ఆదివారం జరిగిన తెలంగాణ జెఎసి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని జెఎసి నేత రఘు మీడియాకు వెల్లడించారు. ఇకపై కోదండరాం లేకుండానే కొత్త జెఎసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

click me!