తెలంగాణ జన సమితి జెండా ఇదే

Published : Apr 04, 2018, 01:33 PM IST
తెలంగాణ జన సమితి జెండా ఇదే

సారాంశం

టిజెఎస్ పార్టీ జెండాను ప్రకటించిన కోదండరాం

తెలంగాణ జన సమితి జెండాను కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత జెండాకు ఒక రూపం ఇచ్చారు జన సమితి నేతలు.

జెండాలో సింహభాగం పాలపిట్ట రంగు ఆక్రమించింది. పైన పాలపిట్ట రంగులో జెండా ఉంది. కింద భాగంలో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పైన ఉన్న పాలపిట్ట రంగు లో ఉన్న భాగంలో నీలి రంగులో తెలంగాణ మ్యాప్ ఉంది. అందులో తెల్ల రంగులో అమర వీరుల స్థూపం ఉంది.

కింద భాగం ఆకుపచ్చ రంగు ఉన్న ప్రాంతంలో తెల్ల రంగులో తెలంగాణ జన సమితి అనే పార్టీ పేరు రాసి ఉంది.

ఈ జెండా రూపకల్పన కోసం పార్టీ నేతలు ముందుగానే జనాల్లో చర్చ పెట్టారు. మూడు నమూనాలు ఇచ్చి వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలంటూ ప్రజలను ఆహ్వానించారు. దీనికి ఎక్కువ మంది సూచించిన దానిని ప్రకటించారు కోదండరాం.

PREV
click me!

Recommended Stories

Farmers Scheme : తెలుగు రైతులకు బంపర్ ఆఫర్.. అకౌంట్లోకి నేరుగా రూ.30,000, సర్కార్ సూపర్ స్కీమ్
Flood Alert : ఏపీలో భారీ వర్షాలే లేవు, అయినా పొంచివున్న వరద ముప్పు.. ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే