ధర్నా చౌక్... కోదండరామ్ అరెస్టు

First Published Mar 26, 2017, 3:24 AM IST
Highlights

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ధర్నాచౌక్ ను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాల  ‘2 కె రన్’

హైదరాబాద్ ర్నాచౌక్‌ ను తరలించాలనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2కే రన్‌లో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంతో పాటు చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, ఇన్నయ్య, పంజుగుల శ్రీశైల్ రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క లతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులను  పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

రన్ కు  ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ  ఆధ్వర్యంలో జరిగింది.

 

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, టిజాక్,  ప్రజా తెలంగాణా వంటి సంస్థలు  ధర్నాచౌక్ ను కాపాడుకునేందుకు  ఈ కమిటీ ఏర్పాటుచేశాయి. దీనికి కన్వీనర్ సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి,  అధ్యక్షుడు ఫ్రొఫెసర్ పి ఎల్ విశ్వేశ్వరరావు.

 

ఈ ఉదయం శాంతియుతంగా రన్ తో ధర్నాచౌక్ చేరుకుని నిరసన తెలపానేది కార్యక్రమం.

 

ఉదయానికల్లా అరేడు వందల ంది  నారాయణ గూడ్ తాజ్ మహాల్ హోటల్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుంచి నడచుకుంటూ మొదట సుందర య్య విజ్ఞానకేంద్రం పార్క్ ను చేరుకోవాలి. అయితే, రన్ ప్రారంభం కావడానికి ముందే పోలీసులు నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి గాంధీ నగర్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లకు తరలించారని ప్రజాతెలంగాణా నాయకుడు పంజుగుల శ్రీశైల్ రెడ్డి తెలిపారు.

 

అరెస్టయిన వారందరిని పది గంటల సమయంలో విడుదల చేశారని కూడా ఆయ నచెప్పారు.

 

తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ప్రజాస్వామిక పోరాటాల వేదిక అయిన ధర్నాచౌక్‌ తరలిస్తున్న సంగతి తెలిసిందే.

 

శాంతి భద్రతల పేరుతో, ఇది  సెక్రెటేరియట్ కు సమీపాన ఉండటం కారణాన ఈ నిర్ణయం  ధర్నాల వేదిక వూరిబయటకు తరలించాలనుకుంటున్నారు.

 

 ఈ నిర్ణయానికి  నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి  ఈ 2కే రన్‌ ప్రారంభించారు.

 

ఈ రన్‌కు అనుమతి లేదంటూ పోలీసులు  సుందరయ్య పార్క్ వద్దే రన్‌ను అడ్డుకున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. పెద్ద ఎత్తున పోలీసుల మొహరింపుతో ఆ ప్రాంతం కర్ఫ్యూను తలిపిస్తోంది.

 

ఇంతటితో ఈ పోరాటం  ఆగిపోదని, తదుపరి కార్యక్రమం ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ తొందర్లోనే ప్రకటిస్తుందని శ్రీశైల్ రెడ్డి చెప్పారు.

click me!