
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
అసెంబ్లీ వద్ద విధులలో ఉన్న ఒక పోలీసు అధికారిని దూషించాడని ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఇవన్నీ అక్రమ కేసులని, ముఖ్యమంత్రి తనను నోరు మయించేందుకు ఇలా కేసులు అక్రమంగా బనాయిస్తున్నారని ఆరోపిస్తూ సోమాజి గూడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి గోశామహాల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
తనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని , తనమీద ఆరోపణలు నిరాధారమయినవి, వాటిని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఆయన సవాల్ విసిరారు.
పోలీస్ స్టేషన్ లో ఉన్న హనుమంత రావు ను టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, దానం నాగేందర్, మల్లు రవి తదితరులు పరామర్శించారు.
తాను బెయిలు కూడా తీసుకోనని, కేసులకు బయపడనని కూడా ఆయన చెప్పారు.