
న్యూఢిల్లీ: తెలంగాణలో రైసు మిల్లులను తనిఖీ చేయాలని FCIని ఆదేశించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బుధవారంనాడు కేంద్ర మంత్రి Kishan Reddy న్యూఢిల్లీ లో మీడియాతో మాట్లాడారు.
Rice Mills ఏ మేరకు Rice ఉండాలో ఆ మేరకు బియ్యం ఉండడం లేదన్నారు. అయితే ఈ విషయమై ఎఫ్ సీ ఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. 4లక్షల53వేల 896 బియ్యం బ్యాగులు తక్కువగా ఉన్నాయని ఎఫ్ సీ ఐ అధికారులు గుర్తించారన్నారు. కేవలం 40 రైస్ మిల్లుల్లోనే తనిఖీలు చేస్తే ఈ విషయం వెలుగు చూపిందన్నారు. దీంతో రైస్ మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించామన్నారు. రైస్ మిల్లుల్లో ఉండాల్సిన బియ్యం ఎక్కడికి వెళ్లిందని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై ఆరా తీస్తామన్నారు. రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాత్రమే ఒప్పందం ఉంటుందన్నారు. అయితే రైస్ మిల్లుల్లో బియ్యం ఎక్కడికి వెళ్లిందనే విషయమై అధికారులు ఆరా తీస్తారని కేంద్ర మంత్రి ప్రకటించారు. రైస్ మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొందో చెప్పాలని ఆయన కోరారు.
ఈ విషయమై గతంలోనే ఓ పార్టీ నేత సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తనకు లేఖ రాశారని పరోక్షంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి లేఖను కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ ఏడాది మార్చి 31న కొన్ని రైస్ మిల్లుల్లో తనిఖీ చేసి బియ్యం బస్తాలు తక్కువగా ఉన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామన్నారు. రైస్ మిల్లుల్లో బియ్యం తక్కుగా ఉన్న విషయమై చర్యలు తీసుకోవాలని లేఖ రాశామన్నారు. ఈ విషయమై రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరామన్నారు. రైస్ మిల్లులపై ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని కూడా కోరామన్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్రం, కేంద్రం మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం సాగుతుంది. ఈ తరుణంలో తాజాగా రైస్ మిల్లుల్లో బియ్యం ఉండాల్సిన స్టాక్ లేదని గుర్తించారు. ఈ విషయమై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇటీవలనే ఈ విసయమై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. బీజేపీ రాస్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ విషయమై ఆరోపణలు చేశారు.
వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేశాయి. అయితే ఈ తరుణంలో కేంద్రం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో రైస్ మిల్లుల్లో బియ్యం తక్కువగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. బియ్యం ఎటు మాయమయ్యాయనే విచారణ చేసి మిల్లులపై చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ఏం చర్యలు తీసుకొందనే దానిపై ప్రభుత్వం ఏం చెబుతుందోననేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.