ఫోన్ ట్యాపింగ్‌పై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Apr 5, 2024, 10:06 AM IST

ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  డిమాండ్ చేశారు.


హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై  ఎన్నికల సంఘం, గవర్నర్ జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  కోరారు.తెలంగాణ రాష్ట్రంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో  కిషన్ రెడ్డి  ఈ డిమాండ్ చేశారు. గురువారం నాడు హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో  కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఫోన్ ట్యాపింగ్ పై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు.

ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.  వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేసి డబ్బులు వసూలు చేసినట్టుగా  వార్తలు వస్తున్న విషయాన్ని  కిషన్ రెడ్డి  గుర్తు చేశారు.దుబ్బాక,హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  కూడ  ఫోన్లను కూడ ట్యాపింగ్ చేశారని  కిషన్ రెడ్డి ఆరోపించారు.  ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ట్యాపింగ్  అంశాన్ని  కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినా బీజేపీ మాత్రం  వదిలిపెట్టదని  కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

Latest Videos

undefined

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ప్రజలకు ఇచ్చిన హామీలను  కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని ఆయన  విమర్శించారు.రైతులకు కొత్త రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 

ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్  ఇటీవలనే పేర్కొన్న విషయం తెలిసిందే. గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే  ఆయన అందుబాటులో లేరని లక్ష్మణ్ మీడియా సమావేశంలో  పేర్కొన్నారు.  తాజాగా కిషన్ రెడ్డి కూడ  ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని  డిమాండ్ చేశారు.

 

click me!