రాహుల్ గాంధీ గారు పీవీ ని మర్చిపోయారా..? కిషన్ రెడ్డి చురకలు..!

Published : Jun 29, 2021, 10:35 AM IST
రాహుల్ గాంధీ గారు పీవీ ని మర్చిపోయారా..? కిషన్ రెడ్డి చురకలు..!

సారాంశం

ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో నిత్యం యాక్టివ్‌గానే ఉంటారని, పీవీకి కనీసం నివాళులర్పిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టలేదని తీవ్రంగా మండిపడ్డారు. 

భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున తాము నివాళులర్పించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

అయితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం పీవీ సేవలను గుర్తుచేసుకోలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పీవీ అనేక పదవులను నిర్వహించి, సేవ చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో నిత్యం యాక్టివ్‌గానే ఉంటారని, పీవీకి కనీసం నివాళులర్పిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టలేదని తీవ్రంగా మండిపడ్డారు. 

పీవీ శత జయంతి సందర్భంగా పీవీ లాంటి గొప్ప నేతకు నివాళులర్పించే తీరిక కూడా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. గాంధీ కుటుంబానికి పీవీ విధేయునిగానే ఉండేవారని, అయినా ఆయన్ను అనేక రకాలుగా అవమానించారని మండిపడ్డారు. ఇలా చేయడం తెలుగు వారిని అవమానించడమే అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Telangana Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్ ... నెలనెలా రూ.81.400 శాలరీతో గవర్నమెంట్ జాబ్స్
తెలుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్.. SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు