Latest Videos

పవన్, బీజేపీ మధ్య దోస్తీ కటీఫేనా?: పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిపోరుకు బీజేపీ నిర్ణయం

By narsimha lodeFirst Published Dec 15, 2023, 2:45 PM IST
Highlights

వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులుండవని బీజేపీ తేల్చి చెప్పింది. తెలంగాణలో ఒంటరి పోరు చేస్తామని  ఈ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.


హైదరాబాద్: వచ్చే  ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేయాలని  భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది జనవరి  30న  తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది.  ఈ ఎన్నికల్లో  111 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. జనసేన ఎనిమిది స్థానాల్లో  బరిలోకి దిగింది.  ఈ ఎన్నికల్లో  బీజేపీ  ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది.  జనసేనకు ఆశించిన ఓట్లు రాలేదు.  తెలంగాణలో తొలిసారిగా  జనసేన పోటీ చేసింది.  తెలంగాణ రాష్ట్రంలో  32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించింది. అయితే  ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని  భారతీయ జనతా పార్టీ  జనసేన వద్ద ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనకు  జనసేన కూడ అంగీకరించింది.   బీజేపీ అభ్యర్థుల తరపున  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ  ప్రచారం నిర్వహించారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  జనసేనతో పొత్తు పెట్టుకున్నా  పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం  బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  శుక్రవారంనాడు ప్రకటించారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడ తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. గత ఎన్నికల్లో  బీజేపీకి  నాలుగు  ఎంపీ స్థానాలు దక్కాయి.  అయితే  2018 అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  కానీ  2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో  బీజేపీ  నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకుంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ  ఎనిమిది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది.  వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో  జరిగే  పార్లమెంట్ ఎన్నికల్లో  అత్యధిక సీట్లు దక్కించుకోవాలని  భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంది.  ఈ నెలలోనే  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా హైద్రాబాద్ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. 

ఈ ఏడాది నవంబర్ మాసంలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో  జనసేనతో పొత్తును  బీజేపీ క్షేత్రస్థాయి క్యాడర్  కొంత వ్యతిరేకించింది.  జనసేనతో పొత్తుతో  నష్టం జరగలేదనే అభిప్రాయాన్ని  బీజేపీ రాష్ట్ర నాయకులున్నారు. లాభం కంటే నష్టం లేకపోతే మంచిదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.  

click me!