భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి.. గన్ తో కాల్చుకుని నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య, ఇద్దరు చిన్న పిల్లల్ని చంపేసి.. గన్ తో కాల్చుకుని నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విధులకు హాజరు కాకపోవడంతో అనుమానంతో ఇంటికి వెళ్లేసరికి, ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. దీంతో విషయం వెలుగు చూసింది. చిన్నకోడూరు మండలం రాముని పట్లలో ఘటన జరిగింది.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామ నివాసి ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులాగే విధులు పూర్తి చేసుకుని... ఇంటికి వచ్చే సమయంలో 9ఎంఎం పిస్టల్ తీసుకొచ్చాడు. దానితో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రి లను కాల్చి చంపేశాడు. ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్థిక సమస్యలా, పనిలో వేధింపులా..ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న దానిపై స్పష్టత లేదు. ఈ కోణంలోపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.