‘కిరణ్ రెడ్డి సాబ్ కైసా హై’.. నల్లారికి మోడీ అప్యాయ పలకరింపు...

Published : Jul 08, 2023, 01:33 PM IST
‘కిరణ్ రెడ్డి సాబ్ కైసా హై’.. నల్లారికి మోడీ అప్యాయ పలకరింపు...

సారాంశం

తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ని ఎయిర్ పోర్ట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  గౌరవంగా స్వాగతించారు.

వరంగల్ : ప్రధాని నరేంద్ర మోడీని ఎయిర్ పోర్ట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గౌరవంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ‘కిరణ్ రెడ్డి సాబ్ కైసా హై’ అని ఆప్యాయంగా పలకరించారు. ఆ మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ లో అవకాశం కల్పించనందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేసారు.

ఇదిలా ఉండగా, గత 9 ఏళ్లలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం శక్తివంచన లేకుండా కృషి చేసిందని ప్రధాని మోదీ వరంగల్ లో మాట్లాడుతూ  అన్నారు. ఈరోజు ప్రధాని మోదీ తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత హన్మకొండ‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించారు. 

ఈ సందర్భంగా మొదట మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. భద్రకాళి అమ్మవారి మహాత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి  నిదర్శనమని.. అలాంటి దేవతలు కొలువై ఉన్న వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech