ఘట్ కేసర్ లో కిడ్నాపైన చిన్నారి సురక్షితం.. పోలీసుల అదుపులో నిందితుడు సురేష్..

By SumaBala Bukka  |  First Published Jul 6, 2023, 11:47 AM IST

ఘట్ కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో కిడ్నాపైన నాలుగేళ్ల చిన్నారి సురక్షితంగా దొరికింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు పాపను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


ఘట్ కేసర్ : మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో బుధవారం రాత్రి కిడ్నాప్ అయిన చిన్నారి కృష్ణవేణి సురక్షితంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు చిన్నారిని గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా సురేష్ ను పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాపను అమ్మే ప్రయత్నంలో.. వేరే ప్రాంతాలకు వెళ్లడానికి సురేష్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

బుధవారం రాత్రి మేడ్చల్ ఘట్ కేసర్ లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చిన్నారి కిడ్నాప్ అయ్యింది. కిడ్నాప్ చేసిన తరువాత పాప ఏడవకుండా ఉండడానికి పాపకు చాక్లెట్ ఇచ్చి.. ఎత్తుకుని తీసుకువెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపించింది. పాపను నేరుగా ఘట్ కేసర్ కు పాపను తీసుకువస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత పాపను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. 

Latest Videos

టమాటా, పచ్చిమిర్చి ఎత్తుకెళ్లిన దొంగలు.. కర్నాటకలోనూ ఘటన.. రూ.2.7లక్షల విలువైన 90 బాక్సులు చోరీ...

కాగా, తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో ఓ నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ అయ్యింది. దీంతో స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటూ ఆ చిన్నారి కనిపించికుండా పోయింది. దీంతో అంతటా వెతికిన తల్లిదండ్రులు దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

బాలిక పేరు క్రిష్ణవేణిగా తెలుస్తోంది. రాత్రి షాప్ కు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ లో మతిస్థిమితం లేని వ్యక్తి దగ్గర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సురేష్ అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు పోలీసులు. సురేష్ రాత్రి 8 గం.ల సమయంలో కిరాణా షాప్ దగ్గరికి వచ్చాడని.. అదే సమయంలో పాప చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్లిందని అంటున్నారు. 

స్థానికులు పాపను సురేష్ తీసుకెళ్లడం చూశామని పోలీసులకు చెబుతున్నారు. తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. సురేష్ తమ పాపను ఏం చేశాడోనని.. తమ పాప తమకు దక్కితే చాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ అనే వ్యక్తి రాత్రి 8.30 గం.ల తరువాత సురేష్, క్రిష్ణవేణిని తీసుకువెళ్లడం చూశాడు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సురేష్ గతంలో కాలేజీలో పనిచేసిన సమయంలోనూ, సినిమా థియేటర్లో పనిచేసే సమయంలోనూ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత వారిని ఏపీకి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిన్నారి కిడ్నాప్ భయాందోళనలు రేకెత్తించింది. అయితే, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా 15 గంటల వ్యవధిలో పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు. 

click me!