మిషన్ తెలంగాణ.. నేడు ఢిల్లీలో టీ కాంగ్రెస్ స్ట్రాటజీ మీట్.. ఎన్నికల వ్యూహంపై చర్చ..!

Published : Jun 27, 2023, 09:37 AM IST
 మిషన్ తెలంగాణ.. నేడు ఢిల్లీలో టీ కాంగ్రెస్ స్ట్రాటజీ మీట్.. ఎన్నికల వ్యూహంపై చర్చ..!

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ప్రస్తుతం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్‌కు పార్టీలో చేరికలు సరికొత్త జోష్‌ని ఇస్తుంది. 

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ప్రస్తుతం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్‌కు పార్టీలో చేరికలు సరికొత్త జోష్‌ని ఇస్తుంది. మరోవైపు నేతల మధ్య సమన్వయం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అధిష్టానం.. టీ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సమావేశం జరగనుంది. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొనున్న సమావేశంలో.. మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, జానారెడ్డి, సంపత్‌ కుమార్, షబ్బలీర్ అలీ, మల్లు రవి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీహెచ్, సీతక్క.. తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు కూడా హాజరుకానున్నట్టుగా సమాచారం. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. పాదయాత్రలో ఉన్నందున  వెళ్లలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. 

ఈ సమావేశంలో పార్టీ నేతల మధ్య సమన్వయంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే పార్టీలో చేరికలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరపనున్నారు. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలతో ఖర్గే, రాహుల్, ప్రియాంకలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది  చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. కాంగ్రెస్ ప్రజలకు అందించే హామీలపై కూడా ఈ బేటీలో చర్చించనున్నట్టుగా సమాచారం. కర్ణాటక తరహాలోనే తెలంగాణ ప్రజలకు ఐదు హామీలను అందించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?