ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురుపై కేసు నమోదు...

Published : Jun 27, 2023, 08:36 AM IST
ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురుపై కేసు నమోదు...

సారాంశం

తండ్రిమీద పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి మీద చేర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. 

జనగామ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతరుపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు. గత కొంతకాలంగా చేర్యాలలో భూమికి సంబంధించి తుల్జాభవానికీ తండ్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వివాదం నడుస్తోంది. తన భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించనున్నట్లు సోమవారం ప్రకటించారు. 

సోమవారం ఉదయం చేర్యాలలో తన పేరుమీదున్న భూమి చూట్టూ వేసిన ప్రహరీగోడను కూల్చేశారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా తుల్జా భవాని కూల్చేసిందని పక్కనే ఉన్న స్థల యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె మీద చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన తండ్రే అతనితో కేసు పెట్టించాడని తుల్జా భవానీ రెడ్డి ఆరోపిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?