అన్ని విషయాలపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని ఖానాపూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న జాన్సన్ నాయక్ ప్రకటించారు.
ఖానాపూర్: తన కులం గురించి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చేసిన ఆరోపణలపై సరైన సమయంలో స్పందిస్తానని ఖానాపూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్న జాన్సన్ నాయక్ ప్రకటించారు. ఈ నెల 21న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు చోటు దక్కలేదు. రేఖా నాయక్ స్థానంలో ఖానాపూర్ నుండి జాన్సన్ నాయక్ కు పార్టీ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది.
బీఆర్ఎస్ జాబితాలో చోటు దక్కించుకున్న జాన్సన్ నాయక్ గురువారంనాడు ఖానాపూర్ కు వచ్చారు. పార్టీ క్యాడర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. ఖనాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు నిలిపివేశారని రేఖా నాయక్ చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గత 9 ఏళ్లుగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు.
undefined
ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు. మరో వైపు నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో ఎలాంటి విబేధాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఖానాపూర్ నుండి రేఖా నాయక్ కు బీఆర్ఎస్ టిక్కెట్టు ఇచ్చింది. అయితే ఈ దఫా రేఖా నాయక్ కు బీఆర్ఎస్ టిక్కెట్టును నిరాకరించింది.
దీంతో రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ ఈ నెల 21వ తేదీ రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో వైపు శ్యాం నాయక్ ఆసిఫాబాద్, రేఖా నాయక్ ఖానాపూర్ అసెంబ్లీ స్థానాల నుండి పోటీకి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు.
also read:బీఆర్ఎస్ మొండి చేయి: కాంగ్రెస్ టిక్కెట్టు కోసం రేఖా నాయక్ ధరఖాస్తు
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు రేఖానాయక్ బీఆర్ఎస్ లో కొనసాగుతారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నందున ఖానాపూర్ అసెంబ్లీ నుండి ఖానాపూర్ కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ఆమె ధరఖాస్తు చేసుకున్నారు.