టీఆర్ఎస్ కు షాక్: కవిత రాజీనామా

By Nagaraju penumalaFirst Published Feb 2, 2019, 10:10 PM IST
Highlights

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి చెందిన లింగాల కమల్ రాజ్ కు టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీగా గెలుపొందారు. 
 
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి షాక్ తగిలింది. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు.  

తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్నన్‌కు అందజేశారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్నయత ఇవ్వడం లేదని అందువల్లే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధిర టికెట్ ఆశించారు. అయితే టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ ససేమిరా అన్నారు. 

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి చెందిన లింగాల కమల్ రాజ్ కు టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీగా గెలుపొందారు. 

ఆమెను జెడ్పీ చైర్‌పర్సర్‌గా ఎంపిక చేశారు కేసీఆర్. ఇకపోతే ఖమ్మం జిల్లాలో టీడీపీకి వరుస షాక్ లు తగలుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీఆర్ఎస్ అనుకూల పవనాలు వీచినా ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతికూల గాలులు వీచాయి. 

ఇకపోతే ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడాన్‌ బేగ్‌ కూడా పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా కవిత రాజీనామా చేశారు. పదవికి మాత్రమే రాజీనామా చేసిన పార్టీకి రాజీనామా చెయ్యకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

click me!