ఒకరి ప్రాణం తీసిన ఆ ఫోటోలు....

Published : Feb 02, 2019, 09:50 PM ISTUpdated : Feb 02, 2019, 09:55 PM IST
ఒకరి ప్రాణం తీసిన ఆ ఫోటోలు....

సారాంశం

తనతో ఆ యువతి దిగిన ఫోటోలను పెళ్లి చేసుకునే యువకుడికి పంపిస్తే పెళ్లి చెడిపోతుందని ఆ యువతి తన వశమవుతుందని భావించాడు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ ఫోటోలను పెళ్లికొడుకు పెళ్లి కూతురు తండ్రికి పంపించాడు. ఆ ఫోటోలను చూసి అతను గుండె పోటుతో మృతి చెందాడు.   

హైదరాబాద్‌: ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా నిశ్చయం చేశారు. తన ప్రియురాలికి పెళ్లి అయిపోతుందని అక్కసుతో రగిలిపోయాడు ప్రియుడు. 

దీంతో తనతో ఆ యువతి దిగిన ఫోటోలను పెళ్లికుమారుడికి పంపించాడు. ఆ ఫోటోలను చూసి నివ్వెరపోయిన పెళ్లికొడుకు కాబోయే మామకు పంపించాడు. ఆ ఫోటోలను చూసిన పెళ్లికుమార్తె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ప్రియుడు చేసిన పనికి ప్రియురాలి తండ్రి చనిపోయిన ఈ ఘోరమైన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ లో ఉంటున్న ఓయువతికి హిందూపూర్ కి చెందిన తిరుపతితో వివాహాం నిశ్చయమైంది. ఆ యువతని అంతకుముందే హఫీజ్‌ ఉల్‌ హక్‌‌ ప్రేమించాడు. అయితే యువతి తనను కాకుండా వేరొకర్ని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన అతగాడు ఆవేశంతో రగలిపోయాడు. 

తనతో ఆ యువతి దిగిన ఫోటోలను పెళ్లి చేసుకునే యువకుడికి పంపిస్తే పెళ్లి చెడిపోతుందని ఆ యువతి తన వశమవుతుందని భావించాడు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ ఫోటోలను పెళ్లికొడుకు పెళ్లి కూతురు తండ్రికి పంపించాడు. ఆ ఫోటోలను చూసి అతను గుండె పోటుతో మృతి చెందాడు. 

దీంతో పెళ్లికూతురు తరుపు బంధువులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడు హపీజ్ ఉల్ హక్ ను అదుపులోకి తీసుకున్నారు. కాబోయే మామకు ఫోటోలు పంపించిన హిందూపూర్ కి చెందిన తిరుపతిని కూడా అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే