టీఆర్ఎస్ ఎంపీ కవిత రాజీనామా...

By Arun Kumar PFirst Published Feb 2, 2019, 4:31 PM IST
Highlights

సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సింగరేణి బొగ్గు కార్మిక  సంఘం గౌరవాధ్యక్ష(టీబీజీకేఎస్) పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా గౌరవాధ్యక్షురాలిగా వున్న వివిధ సంఘాలకు కూడా ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సమయం  దగ్గరపడుతుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎన్నికల సమయంలో పార్టీకే పూర్తి సమయం కేటాయించాలన్న ఉద్దేశ్యంతో కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  కవిత మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అందువల్లే ఆమె మిగతా పదవులన్నింటికి రాజీనామా చేశారు. 

గతంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సంఘం గౌరవాధ్యక్షురాలు టీఆర్ఎస్ ఎంపీ కవిత ఈ ఎన్నికల ప్రచార బాధ్యతను తన భుజాలపై వేసుకుని కష్టపడ్డారు. దీంతో టీబీజీకేఎస్ 11 డివిజన్లకు గానూ 9 డివిజన్లను కైవసం చేసుకోగా, ప్రత్యర్థి సంఘం ఏఐటీయూసీ కేవలం 2 డివిజన్లలో మాత్రమే గెలుపొందింది.

ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే  తన్నీరు హరీశ్‌ రావు ఆర్టీసీ టీఎంయు గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను టీఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డికి పంపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడిన టీఎంయులో కార్మికుల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో హరీశ్ రావు గౌరవాధ్యక్ష భాద్యతలు చేపట్టారు. అప్పటినుండి ఈ పదవిలో కొనసాగుతున్న ఆయన ఇటీవల రాజీనామా ప్రకటించడం సంచలనంగా మారింది.  

click me!