Khammam: చాలా కాలంపాటు అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో ఉంటూ రెబల్ గా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను అధికార పీఠం నుంచి గద్దె దించడమే లక్ష్యమంటూ ప్రకటించారు. ఖమ్మం రాజకీయాలను మరింత వేడెక్కించారు.
Telangana Assembly elections 2023: చాలా కాలంపాటు అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో ఉంటూ రెబల్ గా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను అధికార పీఠం నుంచి గద్దె దించడమే లక్ష్యమంటూ ప్రకటించారు. ఖమ్మం రాజకీయాలను మరింత వేడెక్కించారు. అయితే, మొదటి నుంచి ఖమ్మంలో మారుతున్న రాజకీయ పరిణామాలను గురించి పట్టించుకోకుండా కనిపించిన కేసీఆర్.. ప్రస్తుతం పొంగులేటిని టార్గెట్ చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే ఖమ్మంలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న పొంగులేటితో పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు వ్యూహాలు సిద్ధం చేసిన కేసీఆర్.. పొంగులేటి అనుచరులను గులాబీ బాసు గూటికి చేర్చుకూనేందుకు ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే కీలక నేతలు, పొంగులేటి అనుచరులు కారు ఎక్కబోతున్నారని సమాచారం.
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్-బీఆర్ఎస్ ల మధ్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఇక బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రావాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా కీలకం. ఇక పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరడంతో బీఆర్ఎస్ ప్రభావం తగ్గుతుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ పొంగులేటికి చెక్ పెడితే ఖమ్మంలో తన ప్రభావం కోల్పోకుండా ఉంటామని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పొంగులేటికి చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీని కోసం ఆయన సన్నిహితులతో పాటు కీలక నేతలను కారు ఎక్కించడానికి కేసీఆర్ వ్యూహాలు సిద్ధచేశారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే భద్రాచలం నియోజకవర్గానికి చెందిన తెల్లం వెంకట్రావ్‌ను తిరిగి పార్టీలోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించాయి.
మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌తోపాటు పలువురు ముఖ్యనేతల సమక్షంలో తెల్లం వెంకట్రావ్ గురువారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది పొంగులేటికి ఊహించని షాక్ అని చెప్పాలి. ఇలాంటి తరుణంలో ఆయనకు మరో షాక్ తగలనుందని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ కు పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఆయన పొంగులేటి, కాంగ్రెస్ పార్టీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అయితే, తాటి వెంకటేశ్వర్లు ఏకంగా పొంగులేటినే టార్గెట్ చేయడం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ఎన్నికలకు ముందు ఖమ్మంలో పొంగులేటిని ఒంటరిని చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమనే సంకేతాలను ఆ పార్టీ పంపుతోంది.