ఖమ్మంలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ మేయర్ దంపతులు, తుమ్మల సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 14, 2023, 04:54 PM IST
ఖమ్మంలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ మేయర్ దంపతులు, తుమ్మల సంచలన వ్యాఖ్యలు

సారాంశం

అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగర డిప్యూటీ మేయర్ దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగర డిప్యూటీ మేయర్ దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు జరుగుతున్నది అవినీతి పాలన అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

అంతకుముందు తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తాను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలనేది తన ఆలోచన అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. టీడీపీకి తాను ఎంతో రుణపడి వున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేని చేసి, మంత్రి పదవి ఇస్తే.. బీఆర్ఎస్‌కు ద్రోహం చేశారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. 40 ఏళ్ల రాజకీయం గురించి మాట్లాడటం కేసీఆర్‌కు తగదన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ