ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ అనారోగ్యంతో కన్నుమూత

Published : Oct 01, 2022, 09:32 AM IST
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ అనారోగ్యంతో  కన్నుమూత

సారాంశం

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ శుక్రవారం అర్థరాత్రి దాటాక అనారోగ్యంతో కన్నుమూశారు.

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి దాటాక తుది శ్వాస విడిచారు. శుక్రవారం అర్ధరాత్రి 12.31ని.లకు సుదర్శన్ మరణించారని ఆయన కుమారుడు సింగరి రాజ్ కుమార్ తెలిపారు. ఆయన అంతిమయాత్ర ఖైరతాబాద్  మంచి ప్రారంభమై పంజాగుట్ట హిందూ స్మశాన వాటిక వరకు కొనసాగుతుందన్నారు.

వినాయక చవితి అనగానే హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ పెద్ద గణేష్ గుర్తుకొస్తాడు. హైదరాబాద్ కౌన్సిలర్ గా పనిచేసిన సుదర్శన్ సోదరుడు సింగర్ శంకరయ్య చేతులమీదుగా 1954లో ఇక్కడ గణేశ్ ఉత్సవాల నిర్వహణ మొదలైంది. ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60 ఏళ్లవరకు ఒక్కో అడుగు పెంచారు. 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యాన్ని చాటుతున్నారు. సుదర్శన్ అనారోగ్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం రూపకల్పన బాధ్యతను ఆయన కుమారుడు రాజ్కుమార్ పర్యవేక్షిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu