నేడే గణేశ్ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్ వద్ద భారీ ఏర్పాట్లు

By sivanagaprasad kodatiFirst Published Sep 23, 2018, 7:01 AM IST
Highlights

11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌‌లో ఇవాళ ఆ వేడుకకు మరోసారి రెడీ అయ్యింది. 

11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌‌లో ఇవాళ ఆ వేడుకకు మరోసారి రెడీ అయ్యింది. శోభా యాత్ర సాఫీగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేశాయి.

విగ్రహాల నిమజ్జనానికి 200కు పైగా క్రేన్లు సిద్ధం చేశారు.. నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు,92 సంచార మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. తాగునీరు అందించేందుకు గాను జలమండలి ద్వారా 101 నీటి శిబిరాల ద్వారా 30 లక్షల నీటి ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. మరోవైపు శోభాయాత్ర సందర్భంగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది.

హైదరాబాద్ సహా జిల్లాల్లో జరిగే గణేశ్ నిమజ్జనాన్ని రాజధాని నుంచే సమీక్షించాలని డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయించారు. అన్ని చెరువులు, కాలువల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దానిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు.

వేలాది మంది పోలీసులను మోహరించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించగా మరికొన్ని చోట్ల దారి మళ్లిస్తున్నారు.

click me!
Last Updated Sep 23, 2018, 7:01 AM IST
click me!