లాక్ డౌన్ ఉల్లంఘనలు: హైదరాబాదీలే టాప్

By Sreeharsha GopaganiFirst Published Jul 2, 2020, 1:36 PM IST
Highlights

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో మన హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51(బి)ని ఉల్లంఘించడంలో మన జంటనగరళవాసులు ముందున్నారు. 

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం విధించినప్పటికీ.... ప్రజలు మాత్రం లాక్ డౌన్ ను యథేచ్ఛగా ఉల్లంఘించారు. 

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో మన హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51(బి)ని ఉల్లంఘించడంలో మన జంటనగరళవాసులు ముందున్నారు. 

మార్చి 22 నాటి నుంచి ఈ చట్టం అమలులో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ లాక్ డౌన్ కాలంలో మొత్తంగా  67,557 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం నుండి.....  లాక్‌డౌన్‌ వేళల్లో అకారణంగా బయట తిరగడం వంటి అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డవారిపై ఈ కేసులను నమోదు చేసారు పోలీసులు. 

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 67వేల పైచిలుకు కేసుల్లో....14,346 కేసులతో మన భాగ్యనగరం అగ్ర స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాతి స్థానంలో 6,372 కేసులతో ఖమ్మం కమిషనరేట్‌ రెండవ స్థానంలో ఉంది. 

తెలంగాణ పరిధిలో మాస్కు పెట్టుకోకపోతే పోలీసులు రూ.1,000 జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు పెట్టుకోనివారికి 3,288 మందికి చలానాలు విధించారు. 

మాస్కులు పెట్టుకోనివారిని కృత్రిమ మేధ‌ సాంకేతికత అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నవారికి జారీ చేసిన చలనాల్లో వనపర్తి జిల్లా 846 కేసులతో తొలి స్థానంలో ఉండగా...   585 కేసులతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 

click me!