లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం: జైరాం రమేష్

By Sumanth KanukulaFirst Published Nov 7, 2022, 1:29 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లక్ష్మణ రేఖ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లక్ష్మణ రేఖ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ పంపితే దానిని పరిశీలించి చర్యలు ఉంటాయని తెలిపారు. ఆయన నుంచి సమాధానం రాకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు. 

మునుగోడులో మద్యం, డబ్బుతోనే ఎన్నికలు జరిగాయని జైరాం రమేష్ ఆరోపించారు. మునుగోడులో ప్రజాస్వామ్యం హత్య  చేయబడిందని అన్నారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గట్టిగా పోరాటం చేసిందని కొనియాడారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమితో కాంగ్రెస్ పార్టీ నిరాశ చెందలేదని తెలిపారు. ఫలితాలపై పూర్తి స్థాయిలో సమీక్షించుకుని.. కొత్త ఉత్సహంతో ముందుకు వెళ్తామని చెప్పారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. 

click me!