మునుగోడులో నైతిక విజయం బీజేపీదే.. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Published : Nov 07, 2022, 01:08 PM IST
మునుగోడులో నైతిక విజయం బీజేపీదే.. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సారాంశం

మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం బీజేపీదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రజలను బెదిరించి ఓట్ల వేయించుకున్నారని ఆరోపించారు.

మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం బీజేపీదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రజలను బెదిరించి ఓట్ల వేయించుకున్నారని ఆరోపించారు. 100 మంది మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల రోజుల పాటు మునుగోడులోనే మకాం వేశారని అన్నారు. ఇంత విచ్చలవిడిగా జరిగిన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని చెప్పారు.  ఎన్ని బెదిరింపులకు పాల్పడిన, వందల  కోట్లు ఖర్చు పెట్టిన టీఆర్ఎస్ తక్కువ మెజారిటీతో గెలించిందని.. సీఎం కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తుందన్నారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కుటుంబ పాలనను అంతం చేస్తామని చెప్పారు. 

మునుగోడులో డిపాజిట్ రాని స్థాయి నుంచి రెండో స్థానానికి తమ పార్టీ ఎగబాకిందన్నారు. ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తామని చెప్పారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక, మునుగోడులో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ తెలంగాణ  నాయకత్వం ఈరోజు సాయంత్రం సమీక్ష చేపట్టనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఈ సమావేవం జరగనుంది. ఈ సమీక్షకు మునుగోడులో బీజేపీ నుంచి బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉప ఎన్నిక కోసం పార్టీ నియమించిన ఇంచార్జ్‌లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో మునుగోడులో బీజేపీ ఓటమిపై సమీక్ష నిర్వహించనున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!