రూ.1.10 కోట్ల లంచం తీసుకొన్న కీసర తహసీల్దార్ నాగరాజు: గిన్నిస్ బుక్ ‌రికార్డ్స్‌లో చోటుకు ధరఖాస్తు

By narsimha lodeFirst Published Aug 28, 2020, 3:06 PM IST
Highlights

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పేరును గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేయించాలని రెండు స్వచ్ఛంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.  భూమి పట్టా  కోసం రూ. 2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకొని రూ. 1.10 కోట్లు లంచం తీసుకొంటూ ఎమ్మార్వో ఏసీబీకి చిక్కాడు.


హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పేరును గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేయించాలని రెండు స్వచ్ఛంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.  భూమి పట్టా  కోసం రూ. 2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకొని రూ. 1.10 కోట్లు లంచం తీసుకొంటూ ఎమ్మార్వో ఏసీబీకి చిక్కాడు.

ఈ కేసులో నాగరాజు సహా మరో ముగ్గురు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకొన్న వారు ఎవరూ కూడ లేరు.  దీంతో నాగరాజు పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని రెండు స్వచ్ఛంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

also read:కీసర తహసీల్ధార్‌కి, శ్రీనాథ్ యాదవ్ కి మధ్య నాగరాజు మధ్యవర్తిత్వం: ఏసీబీ రిమాండ్ రిపోర్టు

యూత్ ఫర్ యాంటీ కరఫ్షన్ అధ్యక్షుడు పల్నాటి రాజేందర్ , జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ లు గిన్నిస్ బుక్ రికార్డు కోసం ధరఖాస్తు చేశారు. అయితే ఈ విషయమై గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ స్పందించింది. ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించి తమ వద్ద ప్రత్యేకించి కేటగిరి లేదని  తేల్చి చెప్పింది.

కీసర తహాసీల్దార్ నాగరాజు సహా మరో ముగ్గురు నిందితులను ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకొన్నారు. కానీ నిందితులు నోరు విప్పలేదని ఏసీబీ అధికారులు చెప్పారు. మరోసారి నాగరాజు సహా మిగిలిన వారిని కూడ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
 

click me!