జైల్లో ఆత్మహత్యా... ఎలా సాధ్యం, తోటి ఖైదీలు అడ్డుకోరా: ఎమ్మార్వో నాగరాజు కుటుంబం

By Siva KodatiFirst Published Oct 16, 2020, 7:35 PM IST
Highlights

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అనుమానాస్పద మృతిపై ఆయన కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. నాగరాజుది ఆత్మహత్య కాదని, ఆయనది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు.

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అనుమానాస్పద మృతిపై ఆయన కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. నాగరాజుది ఆత్మహత్య కాదని, ఆయనది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు.

నాగరాజు మరణంపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ వేస్తామని వారు స్పష్టం చేశారు. జైల్లో టవల్‌తో హ్యాంగ్ చేసుకోవడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.

ఉరి వేసుకుంటే పక్కనే వున్న ముగ్గురు ఖైదీలు అడ్డుకోరా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ కేసులో వాస్తవం లేదనడంపై ఆధారాలున్నాయని.. ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజ్ కోర్టుకు ఇచ్చామని నాగరాజు కుటుంబం స్పష్టం చేసింది.

Also Read:చంచల్ గుడా జైల్లో కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య

కావాలనే ఆయనను ఈ కేసులో ఇరికించారని వారు ఆరోపిస్తున్నారు. చనిపోయే రోజు ఉదయం కూడా మాతో మాట్లాడారని చెప్పారు.

కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కిన కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు హైదరాబాదులోని చంచల్ గుడా జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిపై ఏసీబీ ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసింది. 

click me!