
తెలంగాణ రైతులు (telangana farmers) వరికి (paddy) ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr). గురువారం జోగులాంబ గద్వాల్ (jogulamba gadwal) జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్.. తన కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ వెళ్తూ.. ఆకస్మికంగా మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు.
మినుములు, వేరుశనగ దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్లో ధర ఎంత ఉంది? ఎన్ని తడులు నీళ్లు పెట్టాలి? అని రైతులను వివరాలు అడిగారు. మినుములు ఎకరానికి 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనీ, కనీస మద్ధతు ధర క్వింటాల్‌కు రూ. 6,300 ఉండగా, మార్కెట్‌లో ధర రూ. 8 వేలకు పైనే ఉందని రైతులు వివరించారు. వేరుశనగ 10 నుండి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనీ, కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5550 ఉండగా, మార్కెట్‌లో రూ. 7 వేలకు పైనే ఉందని కేసీఆర్ రైతులు వివరించారు.
Also Read:Monkey problem: కోతుల టెన్షన్ లేకుండా చూడాన్న సీఎం కేసీఆర్.. వెంటనే రంగంలోకి సీఎస్ సోమేశ్ కుమార్..
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బంది పడే కంటే ఇతర పంటల సాగు మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఆయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. అనంతరం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని (niranjan reddy) సీఎం కేసీఆర్ ఆదేశించారు.