సంగారెడ్డి : బీసీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 25 మంది విద్యార్ధులకు పాజిటివ్

By Siva KodatiFirst Published Dec 2, 2021, 7:12 PM IST
Highlights

సంగారెడ్డి జిల్లా (sangareddy district) పటాన్‌చెరు (patancheru) మండలం ఇంద్రేశంలో కరోనా కలకలం రేపుతోంది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. 

సంగారెడ్డి జిల్లా (sangareddy district) పటాన్‌చెరు (patancheru) మండలం ఇంద్రేశంలో కరోనా కలకలం రేపుతోంది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. 

కాగా.. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. Telangana రాష్ట్రంలో Corona కేసుల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం  Mask తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది.  

ALso Read:తెలంగాణలో మాస్క్ తప్పనిసరి: లేకపోతే రూ. 1000 ఫైన్

ఇదే రకమైన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కూడా జారీ చేసింది. కరోనా కేసుల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ను తప్పనిసరి చేసిందిఅంతేకాదు బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనని కోరింది. వ్యాక్సిన్ పై కచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని ప్రభుత్వం తెలిపింది. హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం కచ్చితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ ను విధించనున్నారు.

తెలంగాణ సర్కార్. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 188 కింద ఈ ఫైన్ విధించనున్నారు. అయితే ఈ జీవో విడుదల చేసిన రెండు వారాలకే తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 31 కోట్లను Fine రూపంలో వసూలు చేసింది. ప్రజలు మాస్క్ లేకుండా తిరిగిన వారి నుండి  ఈ జరిమానాను వసూలు చేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా Omicron వైరస్ భయపెడుతుంది. దీంతో  ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ ను తప్పనిసరి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. 
 

click me!