
సీఎం కేసీఆర్ శుక్రవారం ఎర్రవల్లిలో పర్యటించారు. దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోకి వచ్చే ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎంతవరకు వచ్చాయో పరిశీలించారు.
సీసీ రహదారులు, హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలను గురించి ఆరా తీశారు. ఎర్రవల్లిలో నిర్మాణంలో ఉన్న ఫంక్షన్ హాల్ పనులను పరిశీలించారు.