నియోజకవర్గంలోని 130 గ్రామ పంచాయితీలకు వరాలు కురిపించారు. ఒక్కో పంచాయితీకి రూ.20 లక్షలు కేటాయించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ఏడుమండల కేంద్రాలకు ఒక్కో మండల కేంద్రానికి రూ.30లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
హుజూర్ నగర్: హుజూర్ నగర్ నియోజకవర్గానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అందించినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
హుజూర్ నగర్ నియోజకవర్గం గెలుపు టీఆర్ఎస్ పార్టీకి ఒక టానిక్ లా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీకీ ఘన విజయం అందించిన ప్రజలకు అంతేవిధంగా ఫలితాలను ఇస్తానని చెప్పుకొచ్చారు.
undefined
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 130 గ్రామ పంచాయితీలకు వరాలు కురిపించారు. ఒక్కో పంచాయితీకి రూ.20 లక్షలు కేటాయించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ఏడుమండల కేంద్రాలకు ఒక్కో మండల కేంద్రానికి రూ.30లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఇకపోతే హుజూర్ నగర్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు వరాలజల్లు కురిపించారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అలాగే నేరేడు చర్ల మున్సిపాలిటీకీ రూ.15కోట్లు కేటాయించారు.
ఇకపోతే లంబాడా సోదరులకు ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ స్కూల్ ను కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే సిమ్మెంట్ ఫ్యాక్టీరీలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో హుజూర్ నగర్ లో ఈఎస్ఐ ఆస్పత్రి వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే హుజూర్ నగర్ లో రెండు మండలాలను కలుపుతూ కోర్టును కూడా ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.