మోడీ చూపిన మార్గంలో తాము ముందుకు వెళ్లనున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్పారు. రేపు మోడీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లరని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్: రేపు హైద్రాబాద్ పర్యటనకు వచ్చే మోడీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ చెప్పారు.
శుక్రవారంనాడు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు మోడీ చూపిన బాటలోనే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ ను స్వాగతం పలికేందుకు రావద్దని మోడీ చెప్పారని ఆయన గుర్తు చేశారు.
కోవిడ్ సమయంలో ప్రోటోకాల్ ను పట్టించుకోలేదన్నారు. ప్రోటోకాల్ పట్టించుకోకుండా కేసీఆర్ ను మోడీ అవమానించారని ఆయన విమర్శించారు ఆనాడు మోడీ చూపిన బాటలోనే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి మోడీ అని వినోద్ కుమార్ విమర్శించారు. ఈ కారణంగానే రాజ్యాంగబద్దంగా సీఎంగా ఎన్నికైన కేసీఆర్ ను అవమానించారని మోడీపై వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు.
గత 14 మాసాల కాలంలో తెలంగాణకు నాలుగు దఫాలు మోడీ వచ్చారు. అయితే నాలుగు దఫాలు కేసీఆర్ మోడీకి స్వాగతం పలకలేదు. రేపు కూడా కేసీఆర్ మోడీకి స్వాగతం చెప్పడానికి వెళ్లబోరని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయమై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి తెలంగాణలో రూ. 1, 300 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వందేభారత్ రైలును కూడా మోడీ ప్రారంభిస్తారు.
also read:తెలంగాణ పర్యటకు ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవిగో
మరో వైపు పేరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు బీజేపీ భారీగా జనసమీకరణ చేస్తుంది.ఎస్ఎస్‌సీ పేపర్ లీక్ కుట్ర కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ అరెస్టయ్యారు. ఈ కేసులో ఇవాళ బండి సంజయ్ విడుదలయ్యారు. ఈ తరుణంలో మోడీ హైద్రాబాద్ కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మోడీ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదనే బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. బండి సంజయ్ ఇష్యూతో పాటు ఇతర అంశాలపై మోడీ ఎలా స్పందిస్తారో చూడాలనే రాజకీయ వర్గాలు సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.