ఫ్రంట్ కోసం కేసీఆర్ పక్కా ప్లాన్: ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్

By Nagaraju TFirst Published Dec 28, 2018, 11:01 AM IST
Highlights

హస్తిన కేంద్రంగా దేశ రాజకీయాలు నడపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ ఇటీవలే ఢిల్లీలో ఉండి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వ్యూహరచన చేశారు. పలు పార్టీల నేతలను కలిశారు. 

ఢిల్లీ: హస్తిన కేంద్రంగా దేశ రాజకీయాలు నడపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ ఇటీవలే ఢిల్లీలో ఉండి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వ్యూహరచన చేశారు. పలు పార్టీల నేతలను కలిశారు. 

ఢిల్లీలో పార్టీ కార్యకలాపాలు నడిపేందుకు ఏపీ భవన్ ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం హస్తిన కేంద్రంగా పార్టీ కార్యాలయం ఉండాలని భావించారు. దీంతో ఢిల్లీలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు. 

అందులో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు, వాస్తు నిపుణుడు సుధాకర్ తో కలిసి కేసీఆర్ ఆ భూములను పరిశీలంచనున్నారు. నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 1000 గజాల స్థలం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ స్థలాల అన్వేషణలో పడ్డారు గులాబీబాస్. 

ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన తర్వాత వాస్తు అన్నీ కుదురితే సంక్రాంతి తర్వాత పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  శంకుస్థాపన చేసిన వెనువెంటనే భవన నిర్మాణ పనులు పూర్తి చెయ్యించాలనే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. 

click me!