ముందస్తు పుకార్లు: కేసిఆర్ భేటీకి మంత్రులకు ఫోన్ కాల్స్

By pratap reddyFirst Published Aug 21, 2018, 9:20 PM IST
Highlights

కేసీఆర్ మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త హామీలకు ఆర్థిక వనరుల వెసులుబాటుపై ఆయన ఈ చర్చ జరిపినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రేపు బుధవారం మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. శాసనసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉహాగానాల నేపథ్యంలో ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. 

మంత్రులతో ఆయన అభ్యర్థుల ప్రకటనపై, సెప్టెంబర్ 4వ తేదీ సభపై చర్చిస్తారని అంటున్నారు. కేసీఆర్ మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త హామీలకు ఆర్థిక వనరుల వెసులుబాటుపై ఆయన ఈ చర్చ జరిపినట్లు తెలుస్తోంది.

వృద్ధాప్య పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ఆయన ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. రైతు రుణమాఫీని రూ. 2 లక్షలకు పెంచే విషయంపై కూడా ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు. 

రేపటి సమావేశానికి హాజరు కావాలని ప్రగతి భవన్ నుంచి మంత్రులకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. అందువల్ల రేపటి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. కాగా, వచ్ేచ నెల 4వ తేదీన హైదరాబాదు శివారులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

click me!