జాతీయపార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇవాళ కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. టీఆర్ఎస్ పేరును మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ ఇవాళ మీడియాకు వివరిస్తారు.
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు ఇవాళ జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారు.టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కొంత కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఫాం హౌస్ వేదికగా జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ చర్చించారు. జాతీయ పార్టీ జెండా, ఎజెండాపై పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చించారు.ఈ విషయాలను ఇవాళ కేసీఆర్ వివరించనున్నారు.
జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పేరును మార్చాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చనున్నారు.
2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. ఈ విషయమై బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు, సీఎంలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.ఈ క్రమంలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
టీఆర్ఎస్ పేరు మార్పు అంశానికి సంబంధించి టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలతో తెలంగాణ భవన్ లో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.
జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశానికి హజరైన ప్రతినిధులు ఈ తీర్మానంపై సంతకాలు చేయనున్నారు. మాజీ స్పీకర్ మధుసూధనాచారి జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నారు. మధుసూధనాచారి ఏక వ్యాక్య తీర్మానాన్నిప్రవేశ పెట్టనున్నారు. ఈ తీర్మానాన్ని సమావేశం ఆమోదించనుంది.ఈ తీర్మానానికి ఆమోదం తెలిపిన ప్రతినిధులు తీర్మానం ప్రతిపై సంతకాలు చేస్తారు. అనంతరం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి మీడియాకు వివరించనున్నారు.
జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై నిర్వహించి తెలంగాణ భవన్ లో నిర్వహించే సమావేశానికి దేశంలోని ఇతర పార్టీలకు చెందిన ప్రతినిధులకు కేసీఆర్ ఆహ్వానం పంపారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సహా ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ చీఫ్ తిరుమలవలన్ కూడా హైద్రాబాద్ కు వచ్చారు.
also read;కేసీఆర్ జాతీయ పార్టీ : హైదరాబాద్‌కు చేరుకున్న కుమారస్వామి... రేపు టీఆర్ఎస్ జనరల్ మీటింగ్‌కి హాజరు
కేసీఆర్ ఏర్పాటు చేయబోయే సమావేశానికి కుమారస్వామి సహా తిరుమలవలన్ హజరై తమ మద్దతును ప్రకటించనున్నారు. ఇవాళ నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానం కాపీనీ రేపు టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి ఈసీకి అందించనుంది.