అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ: 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై చర్చ

By narsimha lodeFirst Published Oct 1, 2020, 5:32 PM IST
Highlights

ఈ నెల 6వ తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు.
 

హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు.

గురువారం నాడు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య  నీటి ప్రాజెక్టుల మధ్య వివాదాలు చోటు చేసుకొన్నాయి. పరస్పరం రెండు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకొన్నాయి.

also read:అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం: ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న సమస్యలు తేలేనా?

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది.తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పై ఏపీ ఫిర్యాదు చేసింది.

గోదావరి నదిపై  నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్న విషయంం తెలిసిందే.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది.

రెండు రాష్ట్రాలు నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో  పట్టుదలగా ఉన్నాయి. ఈ నెల 6వ తేదీన జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలను విన్పించనున్నాయి. ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీరుతో రాష్ట్రాల మధ్య వివాదాలు చోటు చేసుకొంటున్నాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
 

click me!