టీఆర్ఎస్ అభ్యర్థులకు క్లాస్ తీసుకున్న కేసీఆర్

Published : Oct 21, 2018, 07:46 PM IST
టీఆర్ఎస్ అభ్యర్థులకు క్లాస్ తీసుకున్న కేసీఆర్

సారాంశం

ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేసీఆర్ హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. 

హైదరాబాద్: పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో ఆయన ఆదివారం పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అభ్యర్థుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 

ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేసీఆర్ హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. ప్రచారంపై నిర్లక్ష్యం చూపవద్దని కూడా ఆయన చెప్పారు. 

పాక్షిక మేనిఫెస్టోను ఎలా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలనే విషయంపై ఆయన అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు. ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినవారి జాబితాను నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు కేసీఆర్‌ అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu