ప్రగతి నివేదన సభ: బాబుపై పరోక్ష విమర్శలు చేసిన కేసీఆర్

By narsimha lodeFirst Published Sep 2, 2018, 6:51 PM IST
Highlights

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని  ఉమ్మడి ఏపీ సీఎంకు రాసిన లేఖతోనే తాను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. 


హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని  ఉమ్మడి ఏపీ సీఎంకు రాసిన లేఖతోనే తాను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. 

నాలుగున్నర ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించేందుకు ప్రగతి నివేదన సభను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది.
ఈ సభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.  రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందిని సమీకరించాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఈ సభలో కేసీఆర్ విపక్షాలపై నిప్పులు చెరిగారు.బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ కొంగరకలాన్ కు చేరుకొన్నారు.

ప్రపంచమే నివ్వెరపోయే విధంగా .. జనమా ప్రభంజనమా అనే విధంగా ఈ సభకు వచ్చినవారందరికీ  కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సభను చూస్తే 18, 19 ఏళ్ల క్రితం ఘటనలను గుర్తుకు వస్తున్నట్టు ఆయన చెప్పారు.

18 ఏళ్ల క్రితం ఆనాటి సీఎం  విద్యుత్ చార్జీలు పెంచితే  తెలంగాణ రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆనాటి సీఎంను తాను తెలంగాణ బిడ్డగా  విద్యుత్ చార్జీలను తగ్గించాలని  బహిరంగ లేఖ రాసిన విషయాన్ని కోరినట్టు చెప్పినట్టు గుర్తు చేసుకొన్నారు.

సమైక్య రాష్ట్రంలో  తెలంగాణ ప్రజలకు కష్టాలు తీరవని తాను ఆ లేఖలో చెప్పినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. సమైక్యపాలకులు  ఎన్డీఏ ప్రభుత్వాన్ని , రాష్ట్రాన్నిశాసించే పాలకులుగా ఉన్నారని  అప్పటి సీఎం చంద్రబాబుపై కేసీఆర్ పరోక్షంగా విమర్శలు చేశారు.

తొమ్మిది పదో నెలల పాటు మేథోమథనం చేసినట్టు  కేసీఆర్ చెప్పారు.  తెలంగాణ ఉద్యమం చేయాలని  శ్రీకారం చుట్టినట్టు ఆయన చెప్పారు. తాను ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో  అందరూ కూడ భాగస్వామ్యులుగా ఉన్నారని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్ర సమితి పని అయిపోయిందని ఢిల్లీ పెద్దలు చేసిన  ప్రచారాన్ని కూడ ప్రజలు పటాపంచలు చేశారని ఆయన చెప్పారు.


 

click me!