కోర్టు తీర్పులు గౌరవించని కేసిఆర్ దిగిపోవాలి : ఉత్తమ్ ఫైర్

First Published Jun 8, 2018, 2:03 PM IST
Highlights

జానారెడ్డి ఇంట్లో కీలక భేటీ

తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని ప్రజలు భావించారు. కానీ కేసీఆర్ ప్రజల ఆశలను వమ్ము చేశారు. అణచివేత ధోరణితో కేసీఆర్ పాలన సాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అందుబాటులో ఉన్న నేతలతో చర్చించాం. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు పై కేసీఆర్ సర్కార్ అప్రహస్వామికంగా వ్యవహరించింది. కోర్ట్ తీర్పు అమలు లో ప్రభుత్వం , స్పీకర్ పట్టించుకోకపోవడం సరికాదు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెబుతుంటే .. నిరసన తెలిపాము. మా నిరసనలో మండలి చైర్మన్ కు గాయమైనదని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలపై సభ్యత్వరద్దు వేటు వేశారు. కోర్ట్ దాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్యేల సభ్యత్వాలు పునరుద్ధరించాలని తీర్పు చెప్పినా పట్టించుకోవడం లేదు. కోర్ట్ ధిక్కరణ కింద మళ్ళీ కోర్ట్ కు వెళతాం. కేసీఆర్ పాలనలో కోర్ట్ తీర్పులకు గౌరవం లేదా? కోర్ట్ తీర్పు ను గౌరవించని కేసీఆర్ కు సీఎం పదవిలో కొనసాగే నైతికత లేదు. స్పీకర్ ను సమయం ఆడిగాం .. ఈనెల 11  న మాకు సమయం ఇచ్చారు. జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్ ను కలుస్తాం. అనంతరం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ని కలుస్తాం. రాష్ట్రపతి ని కూడా కలిసి జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను వివరిస్తాం.

ఖమ్మం, అలంపూర్ లలో సభలు .. అనంతరం 24 గంటల నిరాహార దీక్ష చేపడతాం. కేసీఆర్ నిరంకుశ చర్యలపై కరపత్రాన్ని ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం.

 

సీఎల్పీ లీడర్ జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. మా ఇంట్లో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయడంతో తప్పులేదు. ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ మాత్రమే. సీఎల్పీ భేటీ అవసరాన్ని బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలపై సీఎల్పీ లో చర్చించలేదు. ఆ చర్చ జరిగినప్పుడు మీడియాకు వివరిస్తాం

click me!