ముందస్తుపై కేసీఆర్ సస్పెన్స్: ఏది మంచి నిర్ణయమైతే అదే తీసుకొంటా

By narsimha lodeFirst Published Sep 2, 2018, 7:34 PM IST
Highlights

ముందస్తు ఎన్నికల విషయమై  తెలంగాణ సీఎం కేసీఆర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  ముందస్తు ఎన్నికల విషయంలో  ఏ నిర్ణయమైనా తీసుకొనే అధికారాన్ని మంత్రివర్గం తనకు అప్పగించిందని చెప్పారు. 


హైదరాబాద్: ముందస్తు ఎన్నికల విషయమై  తెలంగాణ సీఎం కేసీఆర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  ముందస్తు ఎన్నికల విషయంలో  ఏ నిర్ణయమైనా తీసుకొనే అధికారాన్ని మంత్రివర్గం తనకు అప్పగించిందని చెప్పారు. అయితే  రాష్ట్రానికి, టీఆర్ఎస్ కు ఏది మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారా.. లేదా అనే విషయమై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.ఈ విషయమై  కేసీఆర్  సస్పెన్స్ ను కొనసాగించారు. 

అయితే ముందస్తు ఉండకపోవచ్చనే సంకేతాలను మిషన్ భగీరథ పథకంపై మాట్లాడిన సమయంలో ఆయన ముందస్తు ఉండకపోవచ్చుననే సంకేతాలు ఇచ్చారు. ఆదివారం నాడు  ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్  ప్రసంగించారు. మిషన్ భగీరథ గురించి కేసీఆర్ ప్రసంగిస్తూ రక్షిత మంచినీరు  అందించిన తర్వాతే  ఓట్లు అడుగుతానని తాను  హమీ ఇచ్చినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 46 శాతం పనులు జరిగాయని, ఈ పథకాన్ని పూర్తి చేయడానికి ఏప్రిల్ వరకు సమయం ఉందని, దానికి ముందే ఇంటింటికీ నీరు ఇస్తామని ఆయన వివరించారు.

ఇంకా ఎన్నికలకు ఆరు మాసాలు ఉంది.. ఎన్నికలు జరిగే ఆరు మాసాల కంటే  రెండు మూడు మాసాల ముందే  మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రాలకు మంచినీరు ఇస్తామని చెప్పారు. తద్వారా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదనే సంకేతాలను ఇచ్చినట్లయింది.

శాసనసభ రద్దు అంటూ మీడియాలో  వార్తలు రాశారు. ప్రజలుకు ఏది మంచిదైతే .. ఆ నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తనకు అధికారాన్ని ఇచ్చిన విషయాన్ని ఆయన సభలో ప్రకటించారు.  తెలంగాణకు ఏ నిర్ణయం  మంచిదో... టీఆర్ఎస్ కు ఏది మంచిదో నిర్ణయం తీసుకొంటామని  కేసీఆర్ చెప్పారు..రాబోయే రోజుల్లో ఆ నిర్ణయం ఏదో  మీరే చూస్తారని కేసీఆర్ చెప్పారు. ఈ మాటల ద్వారా ముందస్తుపై ఊహాగానాలు చెలరేగడానికి మరోసారి అవకాశం ఇచ్చారు. గడువు ప్రకారం తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2019 ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉంది. 

కొత్త పథకాలను  ప్రకటిస్తారని కూడ మీడియాలో  వార్తలు రాసినట్టు ఆయన చెప్పారు. అలా ప్రకటించడం మంచిది కాదని ఆయన అన్నారు  కానీ, అమలు చేసే  పథకాలను  మాత్రమే ప్రకటించినట్టు ఆయన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో తమకు అధికారాన్ని కట్టబెడితే ఏ రకమైన పథకాలను అమలు చేస్తామో  ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్టు చెప్పారు. 

click me!