రాష్ట్ర ఆదాయం పెంచుతాం ప్రజలకు పంచుతాం: సీఎం కేసీఆర్

By rajesh yFirst Published Sep 2, 2018, 7:23 PM IST
Highlights

రాష్ట్రం ఆర్థికంగా మందుకు పోతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక ప్రగతిలో 17.17 శాతంతో తెలంగాణ రాష్ట్రం మెుదటి స్థానంలో ఉందని కేసీఆర్ తెలిపారు. కొంతమంది నాయకులు సిగ్గులేకుండా ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

హైదరాబాద్: రాష్ట్రం ఆర్థికంగా మందుకు పోతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక ప్రగతిలో 17.17 శాతంతో తెలంగాణ రాష్ట్రం మెుదటి స్థానంలో ఉందని కేసీఆర్ తెలిపారు. కొంతమంది నాయకులు సిగ్గులేకుండా ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

పదేళ్లపాటు కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా 10కోట్లు ఆదాయం వస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లలో ఇసుక మీద తెలంగాణ ప్రభుత్వానికి 1980 కోట్లు ఆదాయం వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. కచ్చితంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతామని తెలిపారు. 

డప్పు కొట్టి సాధించుకునే అవకాశం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామాల్లో ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. గొర్రెలిచ్చారు...ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్తున్నారని మళ్లీ సీఎంగా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.  

click me!