ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

By narsimha lodeFirst Published Oct 3, 2018, 5:32 PM IST
Highlights

తెలంగాణను సర్వనాశనం చేసిన చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెట్టడమేనని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. 

నిజామాబాద్: తెలంగాణను సర్వనాశనం చేసిన చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెట్టడమేనని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. 

నిజామాబాద్‌లో బుధవారం నాడు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగించారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు.

 తెలంగాణను నాశనం చేసిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకొంటారా అని ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.  తెలంగాణను నాశనం చేసిన టీడీపీతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమా ... థూ.... అంటూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు. దుర్మార్గుడైన చంద్రబాబుతో పొత్తా.... ఇంతకంటే దుర్మార్గమా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు బాబుకు తెలంగాణకు దాసోహం చేస్తారని ప్రశ్నించారు. ఏడు మండలాలను చంద్రబాబునాయుడు గుంజుకొన్నాడని కేసీఆర్  చెప్పారు. సీలేరు పవర్ ప్రాజెక్టును గుంజుకొన్నాడని ఆయన చెప్పారు. 

తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తుపెట్టుకొంటారా... అడుక్కొంటే తెలంగాణలో మేం నాలుగు సీట్లు ఇవ్వమా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతిలో తాకట్టు పెట్టుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. 

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి గులామ్ లు.. ఢీల్లీ గులామ్ లు కావాలో తేల్చుకోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గులాం గిరీ మనస్థత్వానికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడమే పరాకాష్ట అన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబునాయుడు రూ.500 కోట్లు డబ్బులిచ్చి మూడు హెలికాప్టర్లు ఇచ్చి ప్రచారం చేయిస్తున్నాడని కేసీఆర్ ఆరోపించారు. ఇంతకాలం పాటు పోరాటం చేసి తెచ్చుకొన్న తెలంగాణను తిరిగి అమరావతికి తాకట్టు పెడుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ మేథావులు ఈ విషయాన్ని ఆలోచించాలని కేసీఆర్ కోరారు.
 

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్
 

click me!