ఢిల్లీ వెళ్లి కొట్లాడదాం.. అమెరికా కంటే భారత్‌ను గొప్ప దేశంగా చేద్దాం: కేసీఆర్

Published : Feb 21, 2022, 04:53 PM IST
ఢిల్లీ వెళ్లి కొట్లాడదాం.. అమెరికా కంటే భారత్‌ను గొప్ప దేశంగా చేద్దాం:  కేసీఆర్

సారాంశం

తెలంగాణను బాగుచేసినట్టే దేశ రాజకీయాల్లో పోరాడదామని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ దాకావెళ్లి కొట్లడదామని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారత దేశం తయారు చేసుకుందామని అన్న కేసీఆర్.. అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.

తెలంగాణను బాగుచేసినట్టే దేశ రాజకీయాల్లో పోరాడదామని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ దాకావెళ్లి కొట్లడదామని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారత దేశం తయారు చేసుకుందామని అన్న కేసీఆర్.. అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే పనికిమాలిన దందా కొనసాగుతుందని.. దానిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిద్దామని తెలిపారు. భారత్‌ను అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసేలా ముందుకు సాగాలని అన్నారు. ఇప్పటివరకు మన దేశంలోని విద్యార్థులు అమెరికా వెళ్తున్నారని.. కానీ విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చేలా అభివృద్ది చేయాలన్నారు. జాతీయ రాజకీయాల్లో వెళ్లి దేశాన్ని బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు. 

సోమవారం సంగారెడ్డి జిల్లాలో రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయ‌ణ‌ఖేడ్ పట్టణ శివారులో కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. వృద్దులకు పెన్షన్‌తో వారి గౌరవం పెరిగిందని చెప్ాపరు. దేశంలో రైతు బంధు పథకం ఎక్కడా లేదన్నారు. నారాయణ్‌ఖేడ్‌కే ఎక్కువగా రైతు బంధు నిధులొస్తున్నాయని తెలిపారు. 

‘తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశాం. ఉధృతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయని చెప్పారు.  తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని అన్నరు. తెలంగాణలో అంధకారం అలుముకుంటుందన్నారు. అప్పుడు విమర్శలు చేసిన చోటనే ఇప్పుడు అంధకారం ఉందన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. ఏడేళ్లలోనే తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు దేశంలో నెం.1 గా తెలంగాణ ఉంది.

తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.  జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాలకు నీరందాలి. ఏడాదిన్నరలోపు ప్రాజెక్టులు పూర్తి చేసేలా నేతలు కృషి చేయాలి. గజ్వేల్ కంటే ఎక్కువగా ఆందోల్‌కు ఎక్కువ నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టుల ద్వారా ఆందోల్‌లోని 1.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశాం. మరోసారి సంగమేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తాను’ అని కేసీఆర్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!