అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు: నాలుగు జిల్లాలో కేసీఆర్ టూర్

By narsimha lode  |  First Published Mar 23, 2023, 12:01 PM IST

అకాల వర్షానికి  దెబ్బతిన్న పంట పొలాలను  సీఎం  కేసీఆర్  ఇవాళ  పరిశీలిస్తారు. నాలుగు  జిల్లాల్లో నష్టపోయిన  పంట పొలాలను  కేసీఆర్  చూస్తారు. 


హైదరాబాద్: అకాల వర్షాలతో  దెబ్బతిన్న పంట పొలాలను  పరిశీలించేందుకు  సీఎం కేసీఆర్  గురువారంనాడు నాలుగు జిల్లాల్లో  పర్యటించనున్నారు.  ఇవాళ ఉదయం  కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో  అకాల వర్షంతో  దెబ్బతిన్న పంట పొలాల పరిశీలనకు  బయలు దేరారు.  ఉమ్మడి ఖమ్మం  జిల్లాలోని  బోనకల్ మండలం  రామాపురానికి  కేసీఆర్  చేరుకున్నారు.  తొలుత ఈ మండలంలో  ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టాన్ని కేసీఆర్ పరిశీలించారు.   ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  సుమారు  22 వేల  ఎకరాలకు  పైగా  పంట నష్టం  వాటిల్లింది.  అయితే  ఇందులో బోనకల్లు మండలంలోనే  10 వేల  ఎకరాల  పంట నష్టపోయిందని  సమాచారం.

ఖమ్మం జిల్లాలోని  రావినూతలలో  సీఎం కేసీఆర్  దెబ్బతిన్న పంటపొలాన్ని పరిశీలించారు.అక్కడి రైతులతో  కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ వెంట  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం,  సీపీఐ  రాష్ట్రకార్యదర్శి  కూనంనేని సాంబశివరావులు  కూడా  ఉన్నారుపంట నష్టం వివరాలపై లెఫ్ట్ పార్టీలతో  కేసీఆర్ చర్చించారు. ఖమ్మం,  మహబూబాబాద్,  వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో  పర్యటిస్తారు  కేసీఆర్.   పంట నష్టంపై  కేసీఆర్  అధికారులకు  స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. 

Latest Videos

click me!