సినీ పరిశ్రమకు కేసీఆర్ వరాలు: రూ. 10 కోట్లలోపు సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్

By narsimha lodeFirst Published Nov 23, 2020, 2:52 PM IST
Highlights

రూ.పది కోట్లలోపు బడ్జెట్ సినిమాలకు జీఎస్టీ రిఎంబర్స్ మెంట్ సహాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు.

హైదరాబాద్:  రూ.పది కోట్లలోపు బడ్జెట్ సినిమాలకు జీఎస్టీ రిఎంబర్స్ మెంట్ సహాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు.

సోమవారం నాడు తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు.  ఆదివారం నాడు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, సి. కళ్యాణ్ లాంటి సమావేశమయ్యారు.

also read:నీటి పన్ను రద్దు,సెలూన్లకు ఉచితంగా విద్యుత్: కేసీఆర్ వరాల జల్లు

మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా సినిమా టికెట్ల ధరను సవరించుకొనే వెసులుబాటును కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అన్ని రకాల సినిమా థియేటర్లలో షోలు పెంచుకొనేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. 

సినిమా థియేటర్లకు కనీస విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే భరించనున్నట్టుగా కేసీఆర్ హమీ ఇచ్చారు. సినిమా థియేటర్లు ప్రారంభమయ్యేవరకు ఈ కనీస చార్జీలను ప్రభుత్వమే విద్యుత్ శాఖకు అందించనుందని ఆయన తెలిపారు. 

40 వేల మంది సినీ కార్మికులకు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను కూడ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.  సినీ రంగానికి చెందిన ప్రముఖులతో ఇప్పటికే తాను చర్చించినట్టుగా ఆయన చెప్పారు.  త్వరలోనే సినీ ప్రముఖులతో మరోసారి సమావేశం కానున్నట్టుగా ఆయన వివరించారు.

click me!