TSRTC Strike: కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఆఫర్: విధుల్లో చేరాలని ఆదేశం

By Nagaraju penumalaFirst Published Oct 24, 2019, 5:23 PM IST
Highlights

కార్మికులు యూనియన్ నాయకుల మాటలు వినకుండా ఆర్టీసీ డిపోలలో అప్లికేషన్స్ పెట్టుకుంటే వారి ఉద్యోగాలు ఉంటాయని లేకపోతే అంతేనని చెప్పుకొచ్చారు. స్వచ్ఛంధంగా ఆర్టీసీ  కార్మికులే వెళ్లిపోయారని వారే స్వచ్ఛంధంగా వచ్చి చేరాలని చెప్పుకొచ్చారు. ఒకవేళ చేరినా వారిని వెళ్లగొట్టే పరిస్థితి కూడా ఉండదన్నారు. 
 

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యికి వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండదని ఖచ్చితంగా డిమాండ్ చేశారు. ఇవే యూనియన్, ఇవే డిమాండ్లతో ఆర్టీసీని నడపడం అంటే అసాధ్యమన్నారు కేసీఆర్. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవమన్నారు కేసీఆర్. ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

నాలుగు రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి 7వేల బస్సులకు పర్మిట్ లు ఇస్తామని తేల్చి చెప్పారు. కేబినెట్ మీటింగ్ కూడా అవసరం లేదని ఒక్క రవాణా శాఖ మంత్రి తాను కలిసి ఒక్క సంతకంతో 7వేల బస్సులను రోడ్డుపైకి తీసుకువస్తామన్నారు. 

read more ఆర్టీసీ ఖతమ్: ఆర్టీసీ సమ్మెపై తేల్చేసిన కేసీఆర్

ఆర్టీసీ హైర్ బస్సులలో 2,350 బస్సులు తిప్పుతామని యజమానులు తెలిపారని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక్క పదిరోజుల్లోనే 7వేల బస్సులు రోడ్డుమీదకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే నాలుగువేల మంది తమ బస్సులను పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీలో బస్సులు పెట్టేందుకు చాలా కాంపిటీషన్ ఉందన్నారు.

ప్రస్తుతం ఉన్న ఛార్జీల కంటే తక్కువ ఛార్జీలు వసూలుతో బస్సులు నడుపుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు చాలు సార్ అనే వరకు నడుపుతామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తెలంగాణ ఆర్టీసీపై ప్రభుత్వం నియంత్రణ లేకుండా పోయిందన్నారు కేసీఆర్. 

యూనియన్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాలుగేళ్లకోసారి జరిగే యూనియన్ ఎన్నికల కోసం ఆర్టీసీని చంపేస్తారా అంటూ మండిపడ్డారు. ఆర్టీసీని ముంచింది ప్రభుత్వాలు కాదని ఆర్టీసీ యూనియన్ నాయకులేనని చెప్పుకొచ్చారు. 

read more ఆర్టీసీ సమ్మె: బుద్ధిజ్ఞానం లేని సమ్మె ఇది, నాపై లంగ ప్రచారం చేస్తారా: కేసీఆర్

తమ సంస్థను తామే చంపుకుంటామని ఆర్టీసీ యూనియన్ నాయకులు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులను చర్చలకు పిలిచే ఆస్కారం లేదన్నారు కేసీఆర్. ఈసారి చర్చలకు పిలిపించి విధుల్లోకి ఆహ్వానిస్తే మళ్లీ జనవరిలో మళ్లీ మెుదలుపెడతారని చెప్పుకొచ్చారు.  

ఈ నేపథ్యంలో ఆర్టీసీ చర్చలు అసాధ్యమన్నారు. మెుదటి డిమాండ్ ఆర్టీసీ విలానం అనేది సరికాదన్నారు. అర్థంపర్థంలేని డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నారని ఈ భూగోళం ఉన్నంత వరకు అది సాథ్యం కాదన్నారు సీఎం కేసీఆర్. 

ఆర్టీసీ యూనియన్ నేతలు, ఇలాగే ఉండి ఇలాగే సంఘాలు ఉంటే ఆర్టీసీని నడపడం కష్టమన్నారు. సంఘాలు, యూనియన్లు లేకపోతే ఆర్టీసీ చాలా బలోపేతం అవుతుందన్నారు. రాబోయే రెండేళ్లలో ఒక్కో ఉద్యోగి రూ.లక్ష బోనస్ తీసుకునే అవకాశం ఉందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

read more సైదిరెడ్డి విజయం ప్రభుత్వానికి టానిక్: ఎల్లుండి హుజూర్ నగర్ కు కేసీఆర్

ఆర్టీసీ కార్మికులతో చర్చలు అనే ప్రసక్తే లేదన్నారు. తాము ఐఏఎస్ అధికారుల కమిటీ వేశామని వారు సక్రమంగా స్పందించకుండా రోడ్డుమీద పడ్డారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీని కాపాడే పరిస్థితి ఎవరికీ లేదన్నారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు సీఎం కేసీఆర్. 

తాము గొంతుకోసుకుంటాం, సమ్మె ఆగదు అని పదేపదే ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారని వారే ముందుకు రాకపోతే తాము ఏం చేయాలని నిలదీశారు. ప్రభుత్వ అధినేతను తిడుతూనే తమతో చర్చలు జరపాలని కోరతారా అంటూ మండిపడ్డారు. 

యూనియన్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలన్నారు. సమ్మె నేథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఆర్టీసీ నాయకులు బాధ్యతగా మెలగాల్సింది పోయి రాజకీయ నాయకుల్లా మాట్లాడతారా అంటూ తిట్టిపోశారు. 

ఆర్టీసీ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బలోపేతం కోసం తాను చేసిన కృషి ఎవరూ చేయలేరన్నారు. యూనియన్ నాయకులు అమాయక కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని చెప్పుకొచ్చారు. 

కార్మికులు యూనియన్ నాయకుల మాటలు వినకుండా ఆర్టీసీ డిపోలలో అప్లికేషన్స్ పెట్టుకుంటే వారి ఉద్యోగాలు ఉంటాయని లేకపోతే అంతేనని చెప్పుకొచ్చారు. స్వచ్ఛంధంగా ఆర్టీసీ  కార్మికులే వెళ్లిపోయారని వారే స్వచ్ఛంధంగా వచ్చి చేరాలని చెప్పుకొచ్చారు. ఒకవేళ చేరినా వారిని వెళ్లగొట్టే పరిస్థితి కూడా ఉండదన్నారు.

click me!