ఎస్సీల మాదిరిగానే ఇతర కులాలకు కూడా రూ. 10 లక్షల సహాయం: కేసీఆర్

By narsimha lodeFirst Published Sep 13, 2021, 9:45 PM IST
Highlights

ఇతర కులాలకు కూడ రూ. 10 లక్షల సహాయం చేసే యోచన చేస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితబంధు పథకం తరహలోనే సహాయం చేయాలని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.తెలంగాణలోని మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సోమవార్ంనాడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
 

హైదరాబాద్: ఇతర కులాలకు కూడా దళితబంధు తరహాలోనే రూ. 10 లక్షలు సహాయం చేఃసే విసయమై యోచిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ తెలిపారు.తెలంగాణలోని మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సోమవార్ంనాడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది దళితబంధుకు బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.  ఏడాదికి రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పారు.

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బ్రాహ్మణులు తదితర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలను అమలు పరుస్తున్నామన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా రైతుబంధు పథకాన్ని అన్ని వర్గాలకు అమలు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క రంగాన్ని వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నరాష్ట్ర ప్రభుత్వం, నేడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే దళితబంధు అమలుకోసం ప్రయోగాత్మకంగా నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు.

దళిత జాతి అభివృద్ధిలో మీరు చాలా గొప్ప పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నానని సమావేశంలో పాల్గొన్న నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. అధికార దర్పంతో కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా పనిచేయాలని అధికారులకు సూచించారు

మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్‌ షిప్‌లు, ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బార్‌, వైన్‌షాప్‌లు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

click me!