తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా ఈటల?: కేసీఆర్ కేబినెట్‌లో వీరే

By narsimha lodeFirst Published Jan 6, 2019, 5:50 PM IST
Highlights

:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఈటల రాజేందర్ ‌పేరును కేసీఆర్ దాదాపుగా ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ పదవి విషయమై  ఈటల రాజేందర్ అంతగా సుముఖంగా లేరనే ఆయన సన్నిహితులు చెబుతున్నారు


హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఈటల రాజేందర్ ‌పేరును కేసీఆర్ దాదాపుగా ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ పదవి విషయమై  ఈటల రాజేందర్ అంతగా సుముఖంగా లేరనే ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈటెల మాత్రం మంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తెలంగాణలో రెండో సారి వరుసగా కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.

అయితే ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. స్పీకర్ పదవికి ఈటల రాజేందర్ పేరు  ప్రముఖంగా విన్పిస్తోంది. ఇటీవల కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సమయంలో ఈటల రాజేందర్  స్పీకర్ పదవిని తనకు వద్దని కోరినట్టు చెబుతున్నారు.

మంత్రి  పదవిపైనే ఆయన ఆసక్తిగా ఉన్నారనే ప్రచారంలో కూడ లేకపోలేదు. స్పీకర్ పదవిపై ఈటల అంతగా ఆసక్తిగా లేరని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే ఈటల రాజేందర్ ఇటీవల కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు వచ్చిన సమయంలో ముఖాముఖి సమావేశంలో స్పీకర్ పదవి తనకు వద్దని చెప్పినట్టు ప్రచరాంలో ఉంది.

కేసీఆర్ ఎనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. వీరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి లేదా ఈటల రాజేందర్‌కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనుంది. ఈటల రాజేందర్  స్పీకర్‌ పదవి తీసుకోకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ పదవిని కట్టబెడతారా అనే చర్చ కూడ లేకపోలేదు.

అయితే ఈ విషయాలపై ఇంకా  స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు ఈ నెల 18వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించే ఛాన్స్ ఉంది. ఈ మంత్రివర్గంలో  హరీష్ రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి లేదా ఈటల రాజేందర్‌, పద్మా దేవేందర్ రెడ్డిలకు పాత వారిలో చాన్స్ దక్కనుంది. ఇక కొత్తగా వేముల ప్రశాంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలకు ఛాన్స్ దక్కనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఆ ఎనిమిది మంది వీరే

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా

 

click me!